మంత్రి హరీష్ రావు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత

మంత్రి హరీష్ రావు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత
  • మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ కౌన్సిలర్ లు, నేతల అరెస్ట్
  • ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలింపు
  • పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతల ఆందోళన

ఇబ్రహీంపట్నం, ముద్ర: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ లో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కాయంజల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వంసం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ అనురాధ రాంరెడ్డి తో పాటు కౌన్సిలర్ లు కోసిగ అయిలయ్య, కోత్తకుర్మ మంగమ్మ శివకుమార్, కుంట్ల ఉదయశ్రి, మేతరి అనురాధ దర్శన్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ లు, పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని హరీష్ రావు గో బ్యాంక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పోలీస్ లకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. మంత్రుల పర్యటన ముగిసిన అనంతరం పోలీసులు వారిని వదిలిపెట్టారు.