రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం

రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
  • దొంగతనాల నివారణకు నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి.
  • జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. వ్యవసాయ, పోలిస్ శాఖా ప్రత్యేక టాస్క్ పోర్స్ బృందాల ఏర్పాటు కోసం వ్యవసాయ, పొలిసు శాఖ అనుసంధాన సమావేశాన్ని జిల్లా వ్యవసాయ అధికారిని బి. వాణితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ  జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయాలకు పాల్పడే విక్రయదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని తెలిపారు.  సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందించాలని సూచించారు.  

మార్కెట్లో బిటి3 పత్తి విత్తనాలకు ఎలాంటి పర్మిషన్ లేదని అనుమతి లేని విత్తన  విక్రయాల దారులవద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు.  విత్తనా డీలర్లుల వద్ద నే విత్తనాలు కొనుగోలు చేయలని, తప్పనిసరిగా బిల్ అడిగి తీసుకోవాలని, గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. నకిలీ విత్తనాల నివారణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని ఈ టీం జిల్లాలో వ్యవసాయ అధికారులను సహాయంతో అన్ని ఎరువుల దుకాణంలో తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎస్పి జిల్లా పొలిసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.