సీనియర్ సిటీజన్లు,పెన్షనర్లకు  ప్రభుత్వం భరోసా, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

సీనియర్ సిటీజన్లు,పెన్షనర్లకు  ప్రభుత్వం భరోసా, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  సీనియర్ సిటీజన్స్ పెన్షనర్స్ కు తెలంగాణ సర్కారు భరోసా కల్పిస్తున్నదని,కేంద్రం రూపొందించిన  తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టాన్ని కేంద్రమే పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  పకడ్బందీ చర్యలు అమలు చేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అస్సోసియేషన్,తెలంగాణ పెన్షనర్స్ అస్సోసియేషన్ల జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తెలంగాణ పెన్షనర్స్  అస్సోసియేషన్ భవన నిర్మాణం కోసం స్థలం  నిధులను,అలాగే తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అస్సోసియేషన్ కు ప్రభుత్వం  కేటాయించిన భవనం శిథిలావస్థకు చేరినందున అట్టి భవన మరమ్మతులు,తదితర సౌకర్యాల కోసం నిధులు  మంజూరు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు.అనంతరం సీనియర్ సిటీజన్స్,పెన్షనర్స్ అస్సోసియేషన్ల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ సిటీజన్స్ కు మరింత భరోసా కల్పించేందుకు వయోవృద్ధుల సంరక్షణ చట్టం -2007 ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేని పలు కీలక ప్రయోజన సవరణలు చేశారని కొనియాడారు.జిల్లా కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల చొరవతో రూ.కోటితో వృద్దాశ్రమ నిర్మాణం  పనులు కొనసాగుతున్నట్లు,ఉద్యోగులు,పెన్షనర్స్,జర్నలిస్టులకు నగదు రహిత వైద్యసేవల కోసం జిల్లా కేంద్రంలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రయత్నం చేస్తుండడం పై కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ ,సీనియర్ సిటీజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,సీనియర్ సిటీజన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత్ రెడ్డి, ఎం.డి.యాకూబ్, జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి వెలముల ప్రకాష్,ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.ఆశోక్ రావు,మహిళా కార్యదర్శి బోబ్బాటి కరుణ, ప్రతినిధులు పాల్గొన్నారు.