గ్రామపంచాయతీ కార్మికులకు సిపిఎం పార్టీ మండల కమిటీ సంఘీభావం
ముద్ర, వెంకటాపురం (నూ): ములుగు జిల్లా, వెంకటాపురం మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను సిపిఎం పార్టీ మండల కమిటీ సందర్శించి సంఘీభావం తెలిపారు అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి. శ్రీను మాట్లాడుతూ వెంకటాపురం మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను స్థానిక సర్పంచ్,ఉప సర్పంచ్, ములుగు జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్మికులను గ్రామ పంచాయతీ కార్యాలయం కు పిలిపించి వారిని పని చేయమని బెదిరిస్తూ, వేధిస్తూ భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ వేదింపులు ఆపకపోతే సిపిఎం పార్టీ కార్మికులకు అండగా నిలిచి వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు, గ్రామ పంచాయతీ కార్మికులును చేస్తున్న న్యాయ మైన సమ్మె పై స్పందించి వారితో చర్చలు జరిపి వారి సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని , వారికి పీ.ఫ్ , ఈ.ఎస్.ఐ.సౌకర్యం కల్పించాలని కోరారు గ్రామ పంచాయతీ కార్మికులకు మండలంలో ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వీరికి మద్దతు తెలపాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు వంకా .రాములు , సొసైటీ వైస్ ప్రెసిడెంట్ చిట్టెం. ఆదినారాయణ, మండల కమిటీ సభ్యులు తోట.నాగేశ్వరావు,సి. ఐ. టి.యు. మండల కార్యదర్శి కట్ల.నర్సింహాచారి,కంటెం.సత్యం,బొగటవిజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.