'బోగత'కు పర్యాటకుల తాకిడి - కనువిందు చేస్తున్న జలపాతం

'బోగత'కు పర్యాటకుల తాకిడి - కనువిందు చేస్తున్న జలపాతం

వెంకటాపురం(నూ), ముద్ర:ములుగు జిల్లాలోని వాజేడుమండలంలో గల బోగత జలపాతం కనువిందు చేస్తుంది. బోగత అందాలను చూసేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతూ వస్తుంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి బొగత జలపాతం వద్దకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోగత అందాలను చూసి తరించిపోతూ, సెల్ఫీ ఫోటోలకు పోజులిచ్చారు.