పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నామినేషన్ ర్యాలీలో ఘర్షణ

పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నామినేషన్ ర్యాలీలో ఘర్షణ

పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నామినేషన్ ర్యాలీలో ఘర్షణ చోటు చేసుకుంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నుండి... జెండా చౌరస్తా వరకు బీజేపీ ర్యాలీ చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.