అనారోగ్యంతో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి  మల్లయ్య మృతి

అనారోగ్యంతో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి  మల్లయ్య మృతి
  • తండ్రి నేత్రాలు దానం చేసిన చందర్..


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: అనారోగ్యంతో రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ తండ్రి మల్లయ్య మంగళవారం ఉదయం మృతి చెందాడు...దుఃఖంలో కూడా తండ్రి నేత్రాలు దానం చేసిన మాజీ ఎమ్మెల్యే  చందర్ ఇద్దరు అంధులకు కంటి చూపు ఇవ్వాలని తెలపడంతో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ నేత్రాలను సేకరించారు. 

గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ లోని వారి నివాసంలో మల్లయ్య పార్థివ దేహాన్ని ఉంచారు. గతంలో మల్లయ్య సింగరేణిలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా మాజీ ఎమ్మెల్యే చందర్, మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించడానికి, తండ్రి నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. లయన్స్ క్లబ్, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్ ద్వారా మల్లయ్య నేత్రాలను హైదరాబాద్ ఐ బ్యాంక్ కు తరలించారు. నేత్ర దాతకు జోహార్లు అర్పించారు. తండ్రి నేత్రాలను దానం చేసిన కోరుకంటి చందర్ ను పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు  అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు తానిపర్తి విజయలక్ష్మి, కార్యదర్శి బంక కళావతి, ప్రతినిధులు బంక రామస్వామి, రాజేందర్, సారయ్య, భిక్షపతి, బెనిగోపాల్ త్రివేది, అన్నపూర్ణ త్రివేది, చంద్రమౌళి, ముకుందరెడ్డి, దయానంద్ గాంధీ, సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర  ప్రతినిధి కే.ఎస్.వాసు, పట్టణ కార్యదర్శి బొళ్ళ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి నేత్రాలను దానం చేసిన  మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి. శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు చంద్రమౌళి, భీష్మాచారి, రాజమౌళి, అన్నపూర్ణ, శశికళ, శారద తదితరులు అభినందించారు. మల్లయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు.