గోదావరిఖని పరిశ్రమ ప్రాంతంలోని ప్రజల రక్షణకు నిరంతరం కృషి చేస్తాం

గోదావరిఖని పరిశ్రమ ప్రాంతంలోని ప్రజల రక్షణకు నిరంతరం కృషి చేస్తాం
  • గోదావరిఖని ఏసీపీ గా బాధ్యతల స్వీకరణలో మడత రమేష్

ముద్ర ప్రతినిధి,పెద్దపల్లి:-గోదావరిఖని పరిశ్రమ ప్రాంతంలోని ప్రజల రక్షణకు నిరంతరం కృషి చేస్తామని గోదావరిఖని ఏసీపీ గా బాధ్యతల స్వీకరణలో మడత రమేష్ అన్నారు. శుక్రవారం ఏసీపీ గా బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు ప్రజా ప్రతినిధులు ఏదైనా సమస్యల ఉంటే వెంటనే  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని,  ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలూ తప్పవన్నారు. టీజింగ్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్ల తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇవ్వద్దన్నారు.   సమస్యలు ఏమున్నా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే మీ సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏసీపీ రమేష్ కు  సిబ్బంది సీఐలు. ఎస్ఐ లు శుభాకాంక్షలు తెలిపారు.