వికారాబాద్ జిల్లాలో అగ్ని ప్ర‌మాదం

వికారాబాద్ జిల్లాలో అగ్ని ప్ర‌మాదం

ముద్ర,తెలంగాణ:- వికారాబాద్ జిల్లాలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. జిల్లా కేంద్ర‌మైన వికారాబాద్‌లో ఈ ఉద‌యం రామ‌య్య‌గూడ‌రోడ్‌లోని ఓ హార్డ్ వేర్ దుకాణంలో అగ్రి ప్ర‌మాదం చోటుచేసుకుంది. దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన వారంతా ఒక్క‌సారిగా నివాసాల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.వెంట‌నే అప్ర‌మ‌త్తమైన చుట్టూప‌క్క‌ల వారు అగ్నిమాపక సిబ్బందికి స‌మాచారం అందించారు. వెంట‌నే వారు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని మంట‌ల‌ను అదుపులోకి తీసుక‌వచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దాదాపు రెండు గంట‌ల పాటు మంట‌లు ఎగెసిప‌డ్డాయి. ఎంతోశ్ర‌మించి అగ్ని మాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు తీసుక‌వ‌చ్చారు. ఈ ఘ‌ట‌న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.