సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం - ( వీడియో )

ముద్ర,సిద్దిపేట:-సిద్దిపేట పట్టణంలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు పేలటంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒకదాని తర్వాత ఒకటి పేలుతుండటంతో.. భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటన స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు అర్పేందుకు ప్రయత్నించాయి.

మంటలు అదుపులోకి రాకపోవటంతో.. పక్కనున్న మండలాల నుంచి మరో మూడు ఫైర్ ఇంజన్లను కూడా రప్పించారు.ట్రాన్స్ ఫార్మర్లు పేలిన శబ్దాలతో చుట్టు పక్కల స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంతో.. సిద్దిపేట మొత్తం విద్యుత్ నిలిచిపోవడంతో పట్టణమంతా అంధకారం అలుముకుంది. అయితే.. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.