కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే

కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే
  • ప్రతిపక్షాలన్నింటికీ ప్రత్యాన్మాయం బిజెపి
    ప్రపంచంలోనే భారత్కు గుర్తింపు తెచ్చింది నరేంద్ర మోడీ
    బిజెపి మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు వ్యాఖ్యలు
    సిద్దిపేటలో జరిగిన నియోజకవర్గ బిజెపి బహిరంగ సభలో పాల్గొన్న మురళీధర్ రావు

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయని భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు ఆరోపించారు. శనివారం రాత్రి సిద్దిపేటలోని శ్రీ  వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద సిద్దిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఏర్పాటుచేసిన మహాజన సంపర్క్ అభియాన్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా బిజెపి అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మురళీధర్ రావు మాట్లాడుతూ కులగోత్రాలు, బందు ప్రీతికి తావు లేకుండా కేవలం  జాతీయవాదం, సిద్ధాంత ప్రాతిపదిక మీద పనిచేస్తున్నది, దేశాన్ని పరిపాలిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ తర్వాత దేశానికి  ప్రదాని ఎవరో , పార్టీకి ఎవరు అధ్యక్షుడో చెప్పలేని పరిస్థితి ఉందంటే అది జాతీయవాద నినాదం, కుటుంబ రహిత విధానానికి, పార్టీ సిద్ధాంతాలకు ప్రభల నిదర్శనం అన్నారు. రాష్ట్రాలలో కెసిఆర్ తర్వాత కేటీఆర్, బాబు తర్వాత లోకేష్, వైయస్ తర్వాత జగన్ అనే పేర్లు తెర మీదికి రావడానికి కుటుంబ పాలనే, కుటుంబ వారసత్వమే తప్ప మరొకటి కాదన్నారు. బిజెపిలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా అని ప్రజలు ఆలోచించాలని కోరారు.

తెలంగాణలో అమలవుతున్న దళిత బంధు పథకంపై మురళీధర్ రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలోని ఇంకా పూర్తికాని దళిత బందు స్కీము రాష్ట్రమంతా వర్తింప చేయడానికి మరిన్ని సంవత్సరాలు పడుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రం కోసం పనిచేయకుండా కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లడం పత్రికా ప్రచారానికేనని ఎన్నికల అప్పుడు ఎక్కడ ఆయన పోటీలో ఉండరని మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై మాట్లాడుతూ ఆ పార్టీ తెలంగాణలో రెండు సార్లు గెలుచుకున్న అసెంబ్లీ సీట్లు ఎవరి ఖాతాలో జమ అయ్యాయో ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటేస్తే  బిఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్లేనని స్పష్టం చేశారు. నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు దేశంలో కుటుంబ పాల రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వరకు వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే

దేశాన్ని తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం వాగులు, కొండలను మాయం చేస్తుందని హైదరాబాదులో చెరువులను మింగేసిందని తీవ్రంగా ఆరోపించారు.ధరణి పేరుతో భూముల స్వహ జరుగుతుందని విమర్శించారు. లంచగొండితనము అవినీతి లేని పరిపాలన కోసం వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలని మురళీధర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరిగే ఉద్యోగుల బదిలీల్లోనూ అవినీతి జరుగుతోందని క్యాడర్ను బట్టి రేటును నిర్ణయించి బదిలీలు చేయిస్తున్నారని మురళీధర్ రావు ధ్వజమెత్తారు.ముస్లిం మహిళలను బాధించిన తలాక్ తలాక్ తలాక్ చట్టాన్ని ,కాశ్మీరీలో బలహీన వర్గాలకు హక్కులు లేని 370 అధికరణ చట్టాన్ని తొలగించిన ఘనత మోడీకే దక్కుతుందని మురళీధర్ రావు కొనియాడారు. 

ప్రపంచంలో తొమ్మిదేళ్లపాటు అవినీతి రహిత పరిపాలన అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దేశంలో రక్తపాతం మత కలహాలు లేకుండా రామాలయాన్ని అయోధ్యలో నిర్మిస్తున్న గొప్ప సన్నివేశం దేశంలో ఇప్పుడు ఉన్నదని చెప్పారు.ఈ సభలో బిజెపి రాష్ట్ర జిల్లా నేతలు రామచంద్రారెడ్డి, విద్యాసాగర్ రావు, రామచంద్రరావు, మోహన్ రెడ్డి ,ఉడత మల్లేశం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మురళీధరరావును గజమాలతో బీజేపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. సభకు ముందు వీర సావర్కర్ విగ్రహానికి మురళీధర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిజెపి సాంస్కృతిక బృందం సభలో పాడిన పాటలు పలువురిని అలరించాయి.