వేసవి సెలవుల్లో పిల్లలను నిర్లక్ష్యం చేయకండి

వేసవి సెలవుల్లో  పిల్లలను నిర్లక్ష్యం చేయకండి
  • తల్లిదండ్రులారా వేసవి సెలవుల్లో మీ పిల్లలు జాగ్రత్త
  • సిద్దిపేట సిపి శ్వేతా రెడ్డి సూచన
  • పిల్లల ఈత సరదా.. విషాదంగా  మారకుండా చూసుకోవాలి...
  • మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి... రోడ్లమీదకి పంపకండి...
  • వేసవిలో మీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోండి...
  • అత్యవసరమైతే మీరే వారిని గైడ్ చేస్తూ ఈత, వయసులో పెద్దవారైతే డ్రైవింగ్ నేర్పించండి ..
  • అంటూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ నేరెళ్లపల్లి శ్వేతారెడ్డి పిల్లల తల్లిదండ్రులకు సూచించారు.
  • సిద్దిపేటలోని తన కార్యాలయంలో శనివారం నాడు సిపి మీడియాతో మాట్లాడారు.
  • జిల్లాలోని ప్రాజెక్టులలో, చెరువులలో,  కుంటలలో నీరు నిండుగా ఉంది.

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి:

సరదా కోసం చెరువులు,బావులకు ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈత నేర్పించాలని ఉద్దేశం ఉంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్స్ లోతు తక్కువగా ఉన్న చెరువుల వద్దకు వెళ్లాలని శ్వేతా రెడ్డి సూచించారు. చెరువులలో తవ్విన జెసిబి గుంతలు ఉంటాయన్న విషయాన్ని మరవ రాదన్నారు ఒంటరిగా, ఫ్రెండ్స్ తో పిల్లలను ఈతకు పంపవద్దని కమిషనర్ సూచించారు.

తల్లిదండ్రులు పిల్లల గురించి వేసవిలో సమయాన్ని కేటాయించాలన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లను మైనర్‌ పిల్లలకు ఇవ్వక పోవడం మంచిదన్నారు, ఏదైనా ప్రమాదం జరగకముందుకు  జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని శ్వేతా రెడ్డి తెలిపారు.  పెద్దవారైతే తామే దగ్గర ఉండి వాహన డ్రైవింగ్ నేర్పించాలని సూచించారు.
స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకుండా ఇంట్లో పెద్దలతో గడిపేందుకు వీలైనంత వరకు పిల్లలను అవకాశాలు కల్పించి ఏమైనా కొత్త విషయాలు నేర్పించాలన్నారు. గతంలో జిల్లాలో జరిగిన అనేక సంఘటనలను తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకొని ఈ వేసవిలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిపి సూచించారు.