రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో  నిరసన దీక్ష

రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో  నిరసన దీక్ష
  • జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రెడ్డిలు
  • ఇన్నాళ్లు యాచించాం ఇక ముందు శాసిస్తాం 
  • రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మ గారి రామ్ రెడ్డి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: తెలంగాణ రెడ్డి జేఏసీ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో రెడ్ల నిరసన దీక్ష జరిగింది. రెడ్డి కార్పొరేషన్ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసన దీక్షకు సిద్దిపేట జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది రెడ్డి కులస్తులు తరలివచ్చారు. నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో (కేసీఆర్ సెంటిమెంట్ గ్రామము లోని దేవాలయం వద్ద)ముఖ్యమంత్రికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వెంటనే కల్పించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామికి రాష్ట్ర రెడ్డి    జేఏసీ అధ్యక్షుడు ఎ. రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం సిద్దిపేటలోని దీక్ష  స్థలం వద్ద పలువురికి పూలమాలలు వేసి నిరసన దీక్ష ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో రెడ్లు 18 శాతం ఉన్నారని , రెడ్డి కులంలో పేదలు ఎంతోమంది ఉన్నందున రెడ్డి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని కోసం యాసిన్చామని , ఎన్నికలు వస్తే శాసించే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. రెడ్డి జెఎసి మహిళా  నాయకులరాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేద రెడ్ల బతుకులపై కళాకారులు పాడిన పాటలు అందరిని అలరించాయి...