కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా సత్తు శ్రీనివాస్ రెడ్డి నియామకం 

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా సత్తు శ్రీనివాస్ రెడ్డి నియామకం 

ముద్ర, తంగళ్ళపల్లి:-రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా సత్తు శ్రీనివాస్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియమించారు.అనంతరం నియామక పత్రాన్ని సత్తు శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమకమైన సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే,రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృధ్దికి కృషి చేస్తానని తెలిపారు.తన నియామకానికి సహకరించిన  సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డికి ,తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్, కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి, మండల  కాంగ్రెస్ నాయకులకు దన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత వైద్య శివ ప్రసాద్,పుర్మాని లింగారెడ్డి,గోనే ఏళ్లప్ప,భరత్ గౌడ్,మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.