వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనిపై వేములవాడ జర్నలిస్టుల నిరసన

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనిపై వేములవాడ జర్నలిస్టుల నిరసన
  • రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు వేములవాడ జర్నలిస్టులపై అనుచిత వాఖ్యలు చేశారని నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజులులుగా వరుసగా నల్లబ్యాడ్జీలు ధరించి ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గాంధీజీ విగ్రహానికి  టీయుడబ్ల్యూజే ఐజేయు ప్రెస్ క్లబ్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు.వేములవాడ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ తనను ప్రశ్నలు అడిగిన పాత్రికేయులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వీటికి నిరసనగా టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు పాత్రికేయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మీడియా పట్ల అహంకారపూరిత ధోరణితో  వ్యవహరిస్తున్నారని, వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్య్రక్రమం లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నూగూరి మహేష్, సీనియర్ పాత్రికేయులు రేగుల దేవేందర్, రాపెల్లి శ్రీనివాస్, గడిల ప్రవీణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి దేవేందర్, దాడుల నివారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొక్కుల శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు బాబు యాదవ్, మ్యాన శ్రీనివాస్, ఎడ్ల చంద్రశేఖర్, మన్నాన్, దూలం సంపంత్, మద్దిరాల నరేష్, దులం రఘు, సయ్యద్ పాషా, గొంగల రవి, జోర్రిగల రవి, సాయి, తూపు కారి  శ్రీనివాస్, తాటికొండ పవన్, కాజా నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.