ఘనంగా బక్రీద్ వేడుక

ఘనంగా బక్రీద్ వేడుక
  • అత్యంత భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరుల ప్రార్థన

ముద్ర,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం లోని గ్రామ గ్రామాన ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముస్లిం సోదరులు సంబరంగా మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేకప్రార్థనలు చేశారు. అనంతరం హిందూ, ముస్లింలు అలింగనం చేసుకుని. బక్రీద్  పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.ఈద్గా మైదానంలో భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నమాజ్ ,మౌళానా చేశారు. పండుగ ప్రాశస్త్యాన్ని ఖుత్బా రూపంలో వివరించి, దైవకృప కోసం ఖురాన్‌లోని సందేశాలతో పాటు ప్రవ క్త మహ్మద్ ఆచరించిన ధర్మమార్గంను గురువులు బోధించారు.ఈద్ సందర్భంగా  ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎఎంసి మాజీ చైర్మన్ గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు జబ్బర్,హాసన్ బాయి, మాజీ ఎంపిటిసి ఉగ్గు బాలరాజ్, డాక్టర్ హైమద్, అజ్జు, సదర్ సాబ్,రఫిక్ , అఫ్జల్ , లాల్ బాయి , జర్నలిస్టు మజీద్ ను కలుసుకొని  బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.