విజ‌య‌వాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నా: కేశినేని నాని

విజ‌య‌వాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నా: కేశినేని నాని

టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను విజ‌య‌వాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నాన‌ని.. సీటు లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని కేశినేని నాని అన్నారు. రాజకీయాల్లో తాను త‌న కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదని.. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని అభినందిస్తానని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ నాలుగేళ్లుగా త‌నకు తెలుసు… వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించానని వివరించారు. త‌నకు తెలిసి మొండి తోక బ్రదర్స్ మంచి వాళ్ళు అని.. ఇసుకలో వాటాలు, మైనింగ్ లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు తాను చేయనని వెల్లడించారు. బెజవాడ పార్లమెంట్ కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తానన్నారు. తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతా అని కేసిఆర్ అన్నారు… తాను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తానన్నారు. వైసీపీ లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే లు ఉదయ భాను , మొండి తోక సమన్వయము చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచి పనులు చేస్తున్నానని స్పష్టం చేశారు. ఎంపీగా ఉన్న తాను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లు సహకరించాలని కోరారు.