బీఆర్ఎస్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ...!

బీఆర్ఎస్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ...!

ముద్ర,వికారాబాద్:-మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితోపాటు ఆయన సతీమణి, వికారాబాద్ జిల్లాపరిషత్ ఛైర్మన్ సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి అంగీకారం తెలిపారు. మహేందర్‌రెడ్డితో పాటు తాను, అనుచరగణంతో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సునీతారెడ్డి ముందుగానే తెలపగా....సీఎంను కలవడంతో వారు చేరిక ఖాయమని తేలిపోయింది. వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. డిల్లీ వెళ్లి మల్లికార్జునఖర్గే సమావేశంలో చేరాలా లేక...కొండగల్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభలో చేరాలా అన్నదానిపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామన్నారు.