ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన వికారాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రాహుల్ శర్మ

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన వికారాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రాహుల్ శర్మ

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ని మేరీ నాట్స్ పాఠశాలలో  వికారాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించిన  ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వికారాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రాహుల్ శర్మ  గురు వారం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా  భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.  ఈ తనిఖీలో వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం తహసీల్దారులు,  ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు, వివిధ రాజకీయ  పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.