శ్రీనాథ్ రోటోపాక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

11 మందీ కి తీవ్ర గాయాలు, పలువరి పరిస్థితి విషమం

ముద్ర, షాద్‌నగర్: ఆదివారం రాత్రి షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామం లో   ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్స్, రిటార్ట్ పౌచ్‌లు మరియు వాక్యూమ్ పౌచ్‌ల తయారీ పరిశ్రమ  శ్రీనాథ్ రోటోపాక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలు కాగా, వెంటనే వైద్య సహాయం కోసం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంధారి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఎంత నష్టం వాటిల్లింది అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.