Venkatesh Netha - సాయంత్రం బీజేపీలో చేరనున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత...
ముద్ర,తెలంగాణ:- లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. నేటి సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డాను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం మోడీ విశేష కృషి చేస్తున్నందున బిజెపిలోకి చేరుతున్నట్లు పెద్దపల్లి సిట్టింగ్ ఏంపీ వెంకటేష్ నేత ఆంధ్రప్రభ కు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ వెంకటేష్ నేత కొద్ది రోజులకే పార్టీ వీడటం కాంగ్రెస్ కు మైనస్ కానుంది.