రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా సీఎస్ శాంతికుమారి పేరుతో మోసాలు

రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా సీఎస్ శాంతికుమారి పేరుతో మోసాలు

ముద్ర,తెలంగాణ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. సీఎస్ శాంతి కుమారి ఫొటోను డీపీగా ఉంచి ప‌లువురికి మేసేజ్‌లు, ఫోన్లు చేశారు. మోసాల‌ను గుర్తించిన సీఎస్ త‌క్ష‌ణ‌మే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సీఎస్ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 9844013103 నెంబ‌ర్ ద్వారా ఫోన్లు చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.