శ్రీదుబ్బరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆదాయం 60.29 లక్షలు

శ్రీదుబ్బరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆదాయం 60.29 లక్షలు
Sridubbarajeswara Swamy Brahmotsavam income

ముద్ర న్యూస్ సారంగాపూర్ : సారంగాపూర్ మండలం పెంబట్ల శ్రీదుబ్బరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదాయం రూ. 60, 29,160 వచ్చినట్లు ఈఓ కాంతరెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో శ్రివరాత్రి సందర్భంగా వచ్చిన హుండీల ఆదాయాన్ని లెక్కించారు . హుండీ ద్వారా రూ.  27, 87, 975, వివిధ టికెట్ల విక్రయం ద్వారా రూ. 22, 59, 185, టెండర్లు ద్వారా రూ.  9, 82, 000 ఆదాయం రాగ మిశ్రమ బంగారం 0.0047.000 మి. గ్రా ,మిశ్రమ వెండి 010.350.000 మి.గ్రా వచ్చినట్లు ఈఓ తెలిపారు.

గత సంవత్సరం కంటే రూ.23,5698 ఎక్కువ వచ్చాయి. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కాంతారెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త శంకరయ్య, ఎంపీపీ కోల జమున శ్రీనివాస్, జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, సర్పంచులు బొడ్డుపెల్లి రాజన్న, ఆకుల జమున రాజిరెడ్డి, పల్లికొండ రవి, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, రెనోవేషన్ కమిటీ సభ్యులు తోడేటి శేఖర్ గౌడ్, తోడేటి గోపాల్ కిషన్, పాంపర్తి కవిత మహేష్, కొలపాక లక్ష్మీరాజం, అత్తినేని నరేశ్, కొంగరి జయశ్రీలింగారెడ్డి, మధుకర్ రావు, మర్రిపెల్లి నారాయణ, అర్వపల్లి శ్రీనివాస్, కస్తూరి రాకేష్, వడ్నాల జగన్, బుతగడ్డ రమేష్ లు పాల్గొన్నారు.

ధర్మపురి లో
ముద్ర న్యూస్, ధర్మపురి:  ధర్మపురి లోని శ్రీ అక్కపెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయ శివరాత్రి హుండీ ని మంగళవారం విప్పి లెక్కించగా 1లక్ష 98వేల974 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ఇట్టి హుండీలో మిశ్రమ బంగారం 6 గ్రాములు, మిశ్రమ వెండి  730 గ్రాములు వచ్చినవి ఇట్టి లెక్కింపు కార్యక్రమంలో ఆలయ రేనవేషన్ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్,సభ్యులు సంగి మోహన్, నూనె సంతోష్,కాశెట్టి విజయ్,గడ్డం రమణ రెడ్డి, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.