విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలి

విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలి
  • గురునానక్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ జిఎస్ కోహ్లీ
  • గురునానక్ విద్యాసంస్థల్లో ఘనంగా స్నాతకోత్సవం

ఇబ్రహీంపట్నం, ముద్ర: విద్యార్థులు ఎల్లప్పుడూ విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలని గురునానక్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ సూచించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యాసంస్థలలో ఇంజనీరింగ్ విద్యార్థుల 19వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 1497 మంది పట్టభద్రులైన విద్యార్థులకు విద్యాసంస్థల వైస్ చైర్మన్ కోహ్లీ, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఎస్ సైని లు మెరిట్ సర్టిఫికెట్లు, డిగ్రీ పట్టాలను అందజేశారు. బాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన గ్రాడ్యుయేట్లకు మెడల్స్ ను బహుకరించారు. సుమారు 120 కు పైగా బహుళ జాతియ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన 1350 మంది విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను, ప్రశంసా పత్రాలను అందచేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రతి విద్యార్థి జీవితంలో మరపురాని సంతోషకరమైన రోజని, గురు నానక్ విద్యా సంస్థలలో నుండి గ్రాడ్యుయేట్ ఐన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, బాధ్యతాయుతంగా మెలగాలని అన్నారు. విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిఎన్ఐటిసి డైరెక్టర్ డాక్టర్ కె వెంకటరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శ్రీనాధ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి పార్థసారధీ, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రిషి సయాల్, డీన్ డాక్టర్ ఎస్వి రంగనాయకులు  వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.