మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి

ముద్ర ప్రతినిధి,ఆదిలాబాద్:ఆదిలాబాద్ మాజీ ఎంపీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ రమేష్ శనివారం 12.49 గంటలకు మృతి చెందారు. శుక్రవారం ఆయనకు రక్తపోటు పడి పోవడంతో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.  అనంతరం గజానంద్ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించి అనంతరం హైదరాబాద్ కు తరలిస్తున్న సమయంలో వాహనంలోనే మృతి చెందారు. 57ఏళ్ల రమేష్ రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన లంబాడీ సామాజిక వర్గ నేత. తెలుగు దేశం పార్టీ  పక్షాన నార్నూర్ జడ్పీటీసీ గా రాజకీయ రంగంలో అరంగేట్రం చేశారు. ఖానాపూర్ శాసన సభ నియోజక వర్గం నుండి  శాసన సభ్యుడిగా1999-2004 మధ్య కాలంలో పని చేశారు.  

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా  2006-2009 మధ్య కాలంలో పని చేశారు.ఆదిలాబాద్ లోకసభ నియోజక వర్గం నుండి 2009-2014 లో 15వ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు.  ఆ తర్వాత టీ ఆర్ ఎస్ లో చేరారు. అనంతరం కాంగ్రెస్లో చేరి, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లో కొనసాగుతున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021 లో బిజెపి లో చేరారు. 2023 లో ఖానాపూర్ ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓటమి చవి చూశారు. రాథోడ్ రమేష్ కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.