ఈత సరదా ఒకరి మృతి

ఈత సరదా ఒకరి మృతి

చెన్నపూర్ గ్రామంలో ఘటన

ముద్ర న్యూస్ రేగొండ:స్నేహితులతో కలిసి ఈత కు వెళ్లి బావిలో ఈత కొడుతూ వెక్తి మృతి చెందిన సంఘటన రేగొండ మండలం రూపిరెడ్డీ పల్లి గ్రామంలో జరిగింది.స్థానికుల సమాచారం ప్రకారం రేగొండ మండలం చెన్నపూర్ గ్రామానికి చెందిన సూరం సమ్మయ్య (సంతు) 32 అనే వెక్తి చెన్నపూర్ గ్రామంలో కూలి పని హమలి పని చేస్తూ జీవనం సాగించేవాడు.ప్రతి రోజులనే గురువారం కుడా హమాలి పని చేసి కాసేపు ఈత  కొడదం అని స్నేహితులు కలిసి రూపిరెడ్డీ గ్రామ శివారు ప్రాంతాల్లో గల ఓడ బావిలో స్నేహితులతో కలిసి ఈత కొడుతూ ఒక్క నోళ్ళలో దూకిన సమ్మయ్య బయటికి రాకపోవడంతో స్నేహితులు కంగుతిని గ్రామస్తులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. అదేవిదంగా పరకాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది తమ వద్ద గల పరికరాలతో నీళ్లలో మునిగిన మృత దేహాన్ని పైకి తీశారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పరిస్థితిని సమీక్షించి విచారన చేపడుతామని తెలిపిన రేగొండ పోలీసులు.