కాన్వాయ్ను ఆపి రోడ్డు పక్కన స్నాక్స్ తిన్న కెసిఆర్...

కాన్వాయ్ను ఆపి రోడ్డు పక్కన  స్నాక్స్ తిన్న కెసిఆర్...

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలో బాగంగా సోమవారం వరంగల్ నుండి ఖమ్మం వెలుతున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ తండా వద్ద కేసిఆర్ బస్సు ఆపి కిందకు దిగారు. రోడ్డు పక్కన ఉన్న చిన్నహోటల్ లోకి వెల్లి అక్కడ అప్పటికే కూర్చుని చాయ్ తాగుతున్న రైతులు, మహిళలతో మాట్లాడారు. సాక్షాత్తు కేసీఆర్ ఒక్కసారిగా తమ చిన్నహోటల్ కు రావడంతో నిర్వాహకులతోపాటు, హోటల్ లో ఉన్నవారు కూడా ఆశ్చర్యంతో షాక్ తిన్నారు.

సాదాసీదాగా కుర్చీలో కూర్చుని హోటల్ వారు చేసిన పకోడీలు, మిరపకాయబజ్జీలు ఆర్డర్ చేసిన కేసీఆర్, ప్రజలతో మాట్లాడుతూ వాటిని రుచిచూసారు. చాయ్ తెప్పించుకుని తాగారు. అక్కడున్న వారితో కరచాలనం చేసి, పోటోలు, సెల్పీలు దిగి తిరిగి బస్సు ఎక్కి బయలుదేరారు.. కలా..నిజమా అనిపించిన  ఈ..హఠాత్ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. కేసీఆర్ వెంట మాజీమంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.