మచిలీపట్నం పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన

మచిలీపట్నం పోర్టుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 4 వేల 5 వందల కోట్లతో పోర్టును నిర్మిస్తారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. 24 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేసి మొదటి షిప్ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.