వరంగల్లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదు

వరంగల్లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదు

ముద్ర ప్రతినిధి : వరంగల్లో శుక్రవారం ఉదయం భూకంపం ప్రకంపనలు సృష్టించింది. ఉదయం 4:43 నిమిషాలకు భూమి కదలికలకు లోనైంది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూమి అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతున కదలికలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. తెల్లవారుజామున ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరిగెత్తారు. భూకంప తీవ్రత స్వల్పంగా ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.