నేరాలను అరికట్టేందుకే సీసీ కెమెరాల ఏర్పాటు - చిట్యాల సీఐ దాసారపు వేణు చందర్

నేరాలను అరికట్టేందుకే సీసీ కెమెరాల ఏర్పాటు  - చిట్యాల సీఐ దాసారపు వేణు చందర్

ముద్ర, మొగుళ్లపల్లి : నేరాలను అరికట్టేందుకే సీసీ కెమెరాలను గ్రామాల్లో  ఏర్పాటు చేయడం జరుగుతుందని చిట్యాల సిఐ దాసారపు వేణు చందర్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని అంకుషాపురం గ్రామంలో క్రైమ్ కు సంబంధించిన ఎలాంటి సంఘటనలు  జరగకుండా..ముందస్తు చర్యలో భాగంగా..ఎస్ఐ జాడి శ్రీధర్ సూచనల మేరకు..సర్పంచ్ గాలి చంద్రమౌళి నేతృత్వంలో గ్రామస్తులు, వ్యాపారస్తుల సహకారంతో గ్రామంలోని ముఖ్య కూడళ్ల వద్ద ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా..బుధవారం సీఐ దాసారపు వేణు చందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలో ఏలాంటి నేరాలు, అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు దోహదపడతాయని తెలిపారు. ఎస్ఐ జాడీ శ్రీధర్  సూచనల మేరకు ముందుకు వచ్చి దాతల సహకారంతో 6 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన సర్పంచ్ గాలి చంద్రమౌళికి ఈ సందర్భంగా సీఐ అభినందనలు తెలిపారు.