నేను టీడీపీ కోవర్టును కాదు సుజనా చౌదరి

నేను టీడీపీ కోవర్టును కాదు సుజనా చౌదరి

మెడికల్​ కాలేజీల అనుమతి రద్దుపై ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. చాలా కంపెనీల్లో, సంస్థల్లో తాను డైరెక్టర్​గా ఉన్నానని చెప్పారు. 2014లోనే తాను మెడికల్​ కాలేజీ డైరెక్టర్​గా తప్పుకున్నానని చెప్పారు. మెడికల్​ కాలేజీ పాలనా వ్యవహారాలతో తనకు సంబంధం లేదన్నారు. కాలేజీల్లో ప్రమాణాలు పెంచడం కోసం కేంద్రం అనుమతులు రద్దు చేస్తే మంచిదేనని అన్నారు. తాను టీడీపీ కోవర్టును కాదని చెప్పారు. ఎవరో ఏదో అంటే తాను స్పందించనని అన్నారు. ప్రస్తుతం బీజేపీ–జనసేన పొత్తులో ఉన్నాయని అన్నారు. టీడీపీతో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఏపీకి చట్టప్రకారమే కేంద్రం సాయం అందిస్తోందని అన్నారు.