నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు          

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు          

పెద్దశంకరంపేట ఎస్ఐ బాలరాజు      

పెద్దశంకరపేట, ముద్ర:నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని  ఎస్ఐ బాలరాజు హెచ్చరించారు. శుక్రవారం పెద్దశంకరంపేట రైతు వేదికలో విత్తన కేంద్రాల నిర్వాహకులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా రషీదు తీసుకోవాలని ఆయన సూచించారు.  విత్తన డీలర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మమత, భవాని, తదితరులు పాల్గొన్నారు.