మొగి పురుగు నివారణకు జాగ్రత్తలు పాటించాలి: వ్యవసాయ అధికారి సాహిద్ అలీ

మొగి పురుగు నివారణకు జాగ్రత్తలు పాటించాలి: వ్యవసాయ అధికారి సాహిద్ అలీ

మెట్‌పల్లి ముద్ర:- వరి పొలంలో మొగి పురుగు నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారి సాహిద్ అలీ రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని కొండ్రికర్ల, కోనరావుపేట్ గ్రామాలలో పంట పొలాలను పరిశీలించారు. వాతావరణ మార్పుల వలన వరి పంట లో మొగి పురుగు అధికంగా ఉందని  మొగి పురుగు నివారణకు కార్చపి హైడ్రోక్లోరైడ్ 4 జీ గూళికలు ఎకరానికి 8 నుండి 10 కిలోలు క్లోరాం త్రిని పోల్ 0.4 గ్రాముల గూళికలు 4 కిలోలు. పొలంలో సమఫాలుగా పడే విధంగా పొలంలో చల్లుకోవాలి ఈ గూళికల వలన పురుగును నివారించవచ్చని తెలిపారు. ఆయన వెంట ఏ ఈ ఓ భూమేశ్వర్, రైతులు అనిరెడ్డి మారుతి, జవుడ రమెష్, గంగా రెడ్డి ఉన్నారు.