కాల్పులలో ‘మావో’ కమాండర్ మృతి చత్తీస్ ఘడ్ లో ఎన్కౌంటర్

కాల్పులలో ‘మావో’ కమాండర్ మృతి చత్తీస్ ఘడ్ లో ఎన్కౌంటర్

మహాదేవపూర్, ముద్ర: తెలంగాణ సరిహద్దులో ఉన్న దంతేవాడ జిల్లాలోని బార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాగనార్ అడవుల్లో తెల్లవారుజామున పోలీసులకు మావోలకు జరిగిన ఎదురుకాల్పులలో బార్పూర్ ఏరియా కమాండర్ మృతి చెందాడు. మృతిచెందిన బార్పూర్ ఏరియా కమాండర్ రతన్ కశ్యప్ గా పోలీసులు గుర్తించారు. పలు కేసులలో నిందితుడిగా ఉన్న రతన్ కశ్యప్ పై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు చత్తీస్గడ్ పోలీసులు వెల్లడించారు. ఘటన స్థలంలో ఆయుధాలు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆపరేషన్ సూర్యశక్తి లో భాగంగా భద్రతా బలగాలు నారాయణపూర్, కాంకేర్, దంతేవాడ జిల్లాలతో పాటు అంబూజ్ మడ్ ప్రాంతంలోని మావోల క్యాంపులపై దాడులు ముమ్మరం చేశారు. దాడుల దరిమిలా నలుగురు కొరియర్లను అదుపులోకి తీసుకోవటంతో పాటు రాకెట్ లాంచర్లు తయారీకి వాడిన వస్తువులను, పేలుడు పదార్థాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.