చేతికొచ్చిన పంటలు.. నీరు లేక చేజారి పోతున్నయ్..!

చేతికొచ్చిన పంటలు.. నీరు లేక చేజారి పోతున్నయ్..!
  • మోరంచ వాగు నీటి ఆశతో పంటలు వేసుకున్న రైతులు
  • మోరంచ వాగులో నీరు లేక ఎండిపోతున్న పంటలు
  • మోరంచ వాగుకు నీరు వదలాలని రైతుల డిమాండ్

చిట్యాల, ముద్ర న్యూస్: చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామ శివారులో గల మోరంచేవాగు ప్రక్కన మోరంచేవాగు నీటి ఆశతో సుమారుగా మూడు నుండి నాలుగు వందల ఎకరాల వరి పంట పొలాలు సాగు చేస్తున్నారు నాటు వేసే సమయంలో మోరంచేవాగు ప్రవహిస్తుండడంతో ఆ నీటి ఆశతో సుమారుగా 400 ఎకరాల వరి సాగును రైతులు సాగు చేశారు ప్రస్తుతం వరి పంట చేతికి వచ్చే సమయానికి మొరంచేవాగు ఎండిపోవడంతో రైతుల వరి పంట ఎండిపోతుండడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు చేతికి వచ్చిన పంట నీరు లేక ఎండిపోవడంతో పెట్టుబడి పెట్టి పంట చేతికి రాక రైతులు తీవ్ర అప్పుల పాలు అవుతున్నామని బోరున విలపిస్తున్నారు ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మోరంచే వాగుకు నీటిని విడుదల చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా నీటిని విడుదల చేస్తే కనీసం రైతులకు పెట్టుబడి అయిన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మీరు విడుదల చేయకపోతే వందల ఎకరాల పొలాలు ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రైతులు పెట్టుబడి రాక ఆత్మహత్య దిక్కు అని బోరున వేదన చెందుతున్నారు మోరంచ వాగు కు నీటిని విడుదల చేయాలని రైతులు శీలం రాజిరెడ్డి శ్రీపతి రాజేష్ బీరవోలు రామ్ రెడ్డి సంపత్ రెడ్డి ఎండి జిలాని మండల రమేష్ మండ గోపి తొట్ల రమేష్ పెండల సంజీవ్ ఉప్పునూతల రాజేందర్ జున్ను పాల కత్తెరశాలు ఎండి రఫీ రైతులు డిమాండ్ చేశారు