కాంగ్రెస్ భారీ వాహన ర్యాలీ

కాంగ్రెస్ భారీ వాహన ర్యాలీ
  • కాళ్లకల్ లో ఘన స్వాగతం పలికిన మహిపాల్ రెడ్డి

ముద్ర,తుఫ్రాన్:-చలో సిద్దిపేట కార్యక్రమం లో  హైదరాబాద్ నుండి మాజి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో న వాహన ర్యాలీగా కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్సి, ఎమ్మెల్యే రోహిత్ రావు తదితరులు బయలుదేరిరాగా   రాష్ట్ర సర్పంచ్ ల ఫోరమ్ తాజా మాజీ కన్వీనర్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తల సమక్షంలో కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద గజమాలతో ఘన స్వాగతం పలికారు.

దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని కొనసాగించారు. అనంతరం టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ అనుబంధ యూనియన్ జెండా ఆవిష్కరణ చేశారు. అంతకుముందు నర్సారెడ్డి సమక్షంలో మనోహరాబాద్ మండల ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు ఆధ్వర్యంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో  నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.