జాతీయస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో జడ్పీహెచ్ఎస్ నాగ్సాన్ పల్లి విద్యార్థిని నందిని

జాతీయస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో జడ్పీహెచ్ఎస్ నాగ్సాన్ పల్లి విద్యార్థిని నందిని

ముద్ర ప్రతినిధి, మెదక్:జాతీయస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో పాపన్నపేట మండలం జడ్పీహెచ్ఎస్ నాగ్సాన్ పల్లి విద్యార్థిని నందిని ఈ నెల 9 నుండి 11 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలో జడ్పీహెచ్ఎస్ నాగ్సాన్పల్లి విద్యార్థిని నందిని  పాల్గొంటున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్,  జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నెలలో నిర్మల్ పట్టణoలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో నందిని ప్రదర్శించిన "అడ్జస్టబుల్ గ్యాస్ స్టవ్ ఫ్లాట్ ఫారం "ప్రాజెక్ట్ జాతీయస్థాయికి ఎంపికైంది. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంది. జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు గుర్తింపు తేవాలని జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి  షా  ఆకాంక్షించారు.