BREAKING: సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో కూలిన టెంట్

ముద్ర, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఎన్నికల సమావేశంలో పెను ప్రమాదం తప్పింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, కూలిన టెంట్ కింద ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.