బీఆర్​ఎస్​లో  చేరిన వెలుగొండ యాదవులు పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

బీఆర్​ఎస్​లో  చేరిన వెలుగొండ యాదవులు పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,  నాగర్ కర్నూల్ :  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిజినపల్లి మండలంలోని  వెలుగొండ గ్రామానికి  చెందిన (కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు  చెందినవారు) యాదవ సోదరులు నిరంజన్, జంగయ్య, పోచలయ్యతో పాటు 50 మంది బీఆర్ఎస్ లో చేరారు.  వారికి పార్టీ కండువా కప్పి  ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి   సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా పార్టీలో చేరినవారు మాట్లాడుతూ  గతంలో తమ  గ్రామాన్ని కమ్యూనిస్ట్ గ్రామంగా పరిగణించి ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదని , కానీ ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వెలుగొండ గ్రామంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని అన్నారు,ముఖ్యంగా వెలుగొండ నుండి వట్టెం వరకు బీటీ  రోడ్డు మంజూరు  చేయించారని అన్నారు. మళ్ళీ తాము  అడిగితే వెలుగొండ నుండి బాజిపూర్ వరకు బీటీ  రోడ్డు మంజూరు  చేశారని అన్నారు. తాము  అడిగిన వెంటనే నిధులు వున్నా  లేకున్నా  సీఎం కేసీఆర్​తో  మాట్లాడి తమకు  రోడ్లు తెచ్చిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి  జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.   తన సొంత  డబ్బులతో పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే   జనార్దన్​ రెడ్డి అన్నారు.