ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీసీ సంక్షేమ అధికారిని అనిల్ ప్రకాష్ ను కక్షపూరితంగా వేరే ప్రాంతానికి బదిలీ చేయించారు.

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీసీ సంక్షేమ అధికారిని అనిల్ ప్రకాష్ ను కక్షపూరితంగా వేరే ప్రాంతానికి బదిలీ చేయించారు.

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి: అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన వ్యక్తిగత కారణంతో అధికారాన్ని  దుర్వినియోగం చేస్తూ  వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడంపై బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా బీసీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్  డి.అరవింద్ చారి మండిపడ్డారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో  బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఏర్పాటుచేసిన సమావేశంలో నాగర్కర్నూల్ జిల్లా బిసి పొలిటికల్ జేఏసీ కన్వీనర్ డి.అరవింద్ చారి విలేకరుల సమావేశంలో  ఈ సందర్భంగా మాట్లాడుతూ అచ్చంపేట ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు వ్యక్తిగత కారణంతో తనకున్న అధికారంతో బీసీ సంక్షేమ శాఖ అధికారి. ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అనిల్ ప్రకాష్  కక్షపూరితంగా వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం అమానుషమని అన్నారు. అతను ఎంతో ఇక్కడ ఉన్నన్నాళ్ళు అతనికి అప్పజెప్పిన పనుల్లో  నిజాయితీగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

గతంలో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నుండి  మహిళా రెసిడెన్షియల్ కళాశాలను  వసతులు లేవన్న కారణంతో షాద్నగర్ కు తరలించారు. దీనికి స్పందిస్తూ గువ్వల బాలరాజు తిరిగి జిల్లా కేంద్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అది ఇంతవరకు సాధ్యపడలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కాబట్టి అధికారంతో జిల్లా కేంద్రంలో అన్ని తాలుకాలలో బీసీ. ఎస్సీ. ఎస్టీ. మైనారిటీ సంక్షేమ హాస్టలను మరియు గురుకులాలకు సొంత భవనాలు కట్టించి మంచి విద్యను అందించాలి. అప్పుడున్న  గత ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీసీ కులాలకు ఫెడరేషన్ లోన్లు కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినారు. అవి అమలు కాకుండా ఇంతవరకు ప్రభుత్వం పబ్బం గడుపుతున్నది. గువ్వల బాలరాజు అధికారం చూపించి నిధులు మంజూరు చేయించాలి.అంతేగాని  ఇలాంటి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని ఒంటెద్దు పోకడ పోతే ప్రజలు నిన్ను గద్దె దించుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు. పరమేష్. రాఘవులు గౌడ్. మల్లేష్.  నవీన్. రాజు యాదవ్. మహేష్ కురుమ తదితర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.