ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం                

ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం                
  • ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం                            
  • అవినీతి అక్రమార్కులపై కేసులు తప్పవు                    
  • కాంగ్రెస్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశా
  • మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా :  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరు పార్టీలో చేరిన స్వాగతిస్తానని గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీని చీల్చేందుకు కుట్రలు చేసే బెదిరేది లేదని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం తాను ఏ త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని అన్నారు . అవినీతిపరులను అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి పార్టీ అభివృద్ధి కోసం పని చేయడంతో పాటు జరిగిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు తన వంతు కృషి చేయడం జరిగిందని అనేక విజయాలు కూడా సాధించడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఇటీవల కొద్ది రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఫోన్ ద్వారా తనకు అండగా నిలవాలని టికెట్ తనకే వస్తుందని అధిష్టానం హామీ ఇచ్చిందని చిచ్చు పెడుతున్నారని ప్రజల కోసం అవినీతిపరుల అంతు తేల్చేందుకు రాబోయే శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతు పలకలని తన విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో తన మద్దతు దారులతో ఆయనకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు గతంలో అధికార పార్టీలో చేరిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కృషి చేశారని అయినప్పటికీ పార్టీలోకి వస్తే తాను స్వాగతిస్తానని అన్నారు.

ఎమ్మెల్సీగా ఆయన నాలుగున్నర సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందని ఈ పర్యాయం తనకు ఎమ్మెల్యే ఎన్నికలలో సహకారం అందించాలని ఆ తదుపరి వచ్చే శాసనసభ ఎన్నికలలో వారి కుమారుడికి అండగా నిలుస్తానని తెలపడం జరిగిందని అన్నారు . పార్టీ అధిష్టానం కూడా సర్వే ప్రకారం టికెట్లను కేటాయిస్తామని పేర్కొనడం జరిగిందని అన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వనాశనం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ మరియు సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ఎందుకు  అడ్డుకోవడం లేదని ఈ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా నాశనం తప్పదు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని కాగ్ నివేదిక తప్పు పట్టడం జరిగిందని అన్నారు మంత్రి హరీష్ రావు అవగాహన లోపంతో వ్యాఖ్యలు చేస్తున్నారని ఉస్మానియా ఆసుపత్రి వైద్య విద్యార్థులకు విద్యను బోధించేందుకు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందని బస్తీ దావకానాలతో ఉస్మానియా యూనివర్సిటీ రోగుల సంఖ్య తగ్గిందని పేర్కొనడం సరికాదని బస్తీ దావకానాలలో ఎలాంటి ఆపరేషన్లు జరగవని అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వంటి మాత్రమే గుర్తు చేశారు తాను స్వార్థం కోసం రాజకీయాలలోకి రాలేదని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా పార్టీలో చేరే సందర్భంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంతమందిని తీసుకు వస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి మండల పార్టీ అధ్యక్షుడు కోటయ్య మున్సిపాలిటీ అధ్యక్షులు పాండు నాయకులు మల్లయ్య గౌడ్ వాల్య నాయక్ వెంకట్ రాములు లక్ష్మయ్య భీముడు సత్యం భీముడు తదితరులు పాల్గొన్నారు