కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకుందాం - బీరం హర్షవర్ధన్ రెడ్డి

కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకుందాం - బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర.కొల్లాపూర్: నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే  కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకుందాం అని ఎమ్మెల్యేగా మరొక్కసారి అవకాశం ఇవ్వాలని కొల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.చిన్నంబావి మండలానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కి లక్ష్మీపల్లి గ్రామ స్టేజ్ దగ్గర నుండి ద్విచక్ర వాహనాలు కార్లతో  చిన్నంబాయి మండల నాయకులు, కార్యకర్తలు,ప్రజలు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.చెల్లేపాడు, అయ్యవారిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ముంపు నిర్వాసితుల 98 జీవో గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ నాయకులకు లేదని, దానికి సంబంధించిన ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నాయని,నియోజకవర్గంలో 19 సంవత్సరాలు అధికారంలో ఉన్న నాయకుడు చెల్లని జీవోలతో కాలం గడిపారని విమర్శించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కొల్లాపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.గోపాల్ దిన్నె లింకు కెనాల్ మంజూరు చేశామని,కాంట్రాక్టర్ కొందరు తో కుమ్మక్కై పనులు చేయకుండా చేశారని విమర్శించారు.మండలంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని,అయ్యవారిపల్లి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చేశామని, విద్యుత్తు తదితర సమస్యలు లేకుండా చేశామని తెలిపారు.సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే,బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు, సిఎం.కేసీఆర్ పాలనలో తెలంగాణ  రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందని,మరొక్కసారి బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తె.. మేనిఫెస్టోలొ చెప్పినట్టు పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.తను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చేసిన పనులు కళ్ల ముందే ఉన్నాయని, మరొక్కసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు.బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, ఆసరా పెన్షన్లు దశలవారీగా రూ.5016 వరకు పెంపు, రైతుబంధు సాయం రూ.16,000వేలకు పెంపు, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ .3000 భృతి,400 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పథకం, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు,పేదలకు ఇళ్ల స్థలాలు.. మొదలైన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని..అందుకే కారు గుర్తుకు ఓటు వేసి మరొమారు గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పిటిసి వెంకటరమణమ్మ,నియోజకవర్గ నాయకులు అభిలాష్ రావు,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ధారాసింగ్,  మండల రైతు బంధు సమితి అధ్యక్షులు మధు, పెద్దమారూర్ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ ఇంద్రసేనా రెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, నరసింహ, శ్రీధర్ రెడ్డి, రామన్ గౌడ్,వేంకట రెడ్డి,మద్దిలేట్టి తదితరులు ఉన్నారు.