సాయిచంద్ మరణం సమాజానికి తీరని లోటు

సాయిచంద్ మరణం సమాజానికి తీరని లోటు
  • సాయిచంద్ సన్మానం అనుకున్నాం.. సంతాప సభ బాధాకరం
  • బీఆర్ఎస్ కు మూలస్తంభం సాయిచంద్
  • సాయి చంద్ సంతాప సభలో ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ BRS పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన మలిదశ ఉద్యమ కెరటం,తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్,ప్రముఖ కవి గాయకుడు సాయి చంద్ సంతాప సభ కార్యక్రమంలో పాల్గొని అయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినా  ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, తెరాసా రాష్ట్ర కార్యదర్శి బైకనీ శ్రీనివాస్ యాదవ్,కవి,గాయకులు మిట్టపల్లి సురేందర్.

ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ... 
సాయిచంద్ మరణం సమాజానికి తీరని లోటు సాయిచంద్ సన్మానం అనుకున్నాం... సంతాప సభ బాధాకరము బీఆర్ఎస్ కు మూలస్తంభం సాయిచంద్ నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు సాయిచంద్ సంస్మరణ సభ పెడతాం అనుకోలేదు సింగపూర్ లో ఉన్నప్పుడు సాయిచంద్ విషయం తెలిసి తట్టుకోలేకపోయాను కుటుంబాన్ని ఆదుకుంటాంసాయిచంద్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయిస్తాను సీఎం కేసీఆర్ సాయిచంద్ నాకు కావాలని అడిగారు త్వరలో సాయిచంద్ కూతురి పేరిట రూ.21 లక్షలు అందజేస్తాను ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు,దళిత నాయకులు పాల్గొన్నారు.