కేక పుట్టిస్తున్న పుష్ప-2 టైటిల్ సాంగ్ ప్రోమో
ముద్ర, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్న పుష్ప-2 మూవీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ సినిమా టైటిల్ సాంగ్ ప్రోమోను కొద్ది సేపటి క్రితం నిర్మాతలు విడుదల చేశారు. పుష్ఫ,..పుష్ప... పుష్పరాజ్... అంటూ సాగే లిరిక్స్, అద్భుతమైన డీఎస్ పీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. సినిమా తొలిపాటను మే 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.