ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణ చాంద మండలం చామన్ పల్లి గ్రామానికి చెందిన రైతులు బుధవారం రాస్తా రోకో నిర్వహించారు. వాహనాలు నడవకుండా అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. ఐతే రైతులు ససేమిరా అంటూ కదలలేదు. చివరికి అధికారుల జోక్యంతో రాస్తా రోకో విరమించారు.