గ్రామపంచాయతీ కార్మికుల వినూత్న నిరసన

గ్రామపంచాయతీ కార్మికుల వినూత్న నిరసన
  • మోకాళ్ళపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఇబ్రహీంపట్నం, ముద్ర:-కనీస వేతనం పెంపు సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్మికులు చేపడుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మె సోమవారం నాటికి 19వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల ముందు మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగ, కార్మికులను పర్మినెంట్ చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బందికి కేటగిరి వారిగా వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి ప్రభుత్వమే రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, గ్రాట్యూటీ, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. అప్పటి వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.