మిషన్‌ కాపు... పవన్‌ ప్లాన్‌

మిషన్‌ కాపు... పవన్‌ ప్లాన్‌
pawan kalyan started mission kapu

ఇక ఏపీ రాజకీయాల్లో పవన్‌ కంటిన్యూ కానున్నారు. ఇంతకాలం సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటూ..అప్పుడప్పుడు ఏపీకి వచ్చి అక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడటం చేస్తున్నారు. దీని వల్ల పవన్‌ని వీకెండ్‌ నాయకుడు అని వైసీపీ విమర్శలు చేస్తుంది. ఎన్ని విమర్శలు వచ్చిన తన వృత్తి ప్రకారం సినిమాలని వదులుకోలేదు..ఇటు ప్రజల కోసం సమస్యలపై పోరాటం చేస్తున్నారు.అయితే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్‌ ఇంకా ఫుల్‌ టైమ్‌ రాజకీయాల్లో కొనసాగడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర చేయడానికి రెడీ అయ్యారు. ఇదే క్రమంలో బస్సుని రెడీ చేసుకుని దానికి వారాహి అని పేరు కూడా పెట్టారు. ఇప్పటికే  ఆ బస్‌ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలు తెలంగాణలో ముగిశాయి. అతి త్వరలోనే పవన్‌ బస్సు యాత్రతో ముందుకు రానున్నారు. ఇంకా షెడ్యూల్‌ రాలేదు గాని..ఈ జనవరిలోనే బస్సు యాత్ర మొదలుపెడతారని సమాచారం.ఇక 100 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో మిషన్‌`100 అని టార్గెట్‌ పెట్టుకున్నట్లు సమాచారం. అంటే ఈ 100 స్థానాల్లో జనసేన బలపడటమే లక్ష్యం. ఈ స్థానాల్లో అభ్యర్ధులని కూడా ప్రకటించాలని చూస్తున్నట్లు సమాచారం. కాకపోతే పొత్తుల బట్టి అభ్యర్ధులు ఉండే ఛాన్స్‌ ఉంది. అయితే టీడీపీతో పొత్తు ఉంటే జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనేది క్లారిటీ లేదు.ఆ సీట్లు బట్టే అభ్యర్ధుల ఎంపిక కూడా ఉంటుందని సమాచారం. కానీ పొత్తులపై ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు..ఎన్నికల సమయంలోనే పొత్తులు ముందుకు రావచ్చు. కాకపోతే తప్పనిసరిగా టీడీపీ`జనసేన పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు బీజేపీ కలిసొస్తుందా? లేదా అనేది క్లారిటీ లేదు. మరి చూడాలి పవన్‌ రాజకీయం ఎలా ఉండనుందో.
సైకిల్‌ తోనా...  కమలంతోనా
ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచి పొత్తుకు సంబంధించిన అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ`జనసేన పార్టీల పొత్తు ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఇక పొత్తుకు అటు చంద్రబాబు, ఇటు పవన్‌ సైతం సుముఖంగానే ఉన్నారని..అప్పుడప్పుడు వారు చేసి కామెంట్లు బట్టి అర్ధమవుతుంది. అలాగే మధ్యలో ఒకసారి పవన్‌ని బాబు కలిశారు.ఇక పవన్‌ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని, వైసీపీని ఖచ్చితంగా అధికారంలో నుంచి దించేస్తామని అంటున్నారు. అయితే టీడీపీతో పొత్తుకు పవన్‌ ఓకే..కానీ ప్రస్తుతం పవన్‌..బీజేపీతో కలిసి ఉన్నారు. బీజేపీ ఏమో చంద్రబాబుతో పొత్తు వద్దు అని..ముందు నుంచి చెబుతూనే ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీతో కలిసి ముందుకెళ్లడానికి ఇటీవలే బాబు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖమ్మంలో భారీ సభ పెట్టి అక్కడ పార్టీ బలం తగ్గలేదని నిరూపించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ`బీజేపీ పొత్తు ఉంటాయని ప్రచారం వచ్చింది.ఈ క్రమంలో తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌..టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, కార్యకర్తలకు కూడా అదే చెప్పాలని నేతలకు సూచించారు. ఇలా బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు బంతి పవన్‌ కోర్టులోకి వచ్చింది. టీడీపీతో కలవాలంటే బీజేపీని కూడా కలుపుని రావాలి. బీజేపీ కలిసేలా లేదు.దీని వల్ల టీడీపీ కావాలంటే బీజేపీని వదిలేయలి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదలడం ఈజీ కాదు. చంద్రబాబే పదే పదే మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలాంటప్పుడు బీజేపీని వదిలి టీడీపీతో కలుస్తారా? అనేది పెద్ద ప్రశ్న. కానీ టీడీపీ`జనసేన కలిస్తేనే వైసీపీకి చెక్‌ పెట్టగలవు. అందుకే వైసీపీ సైతం..ఆ రెండు పార్టీల పొత్తు లేకుండా చేయాలనే కష్టపడుతుంది. మరి చివరికి పవన్‌ బీజేపీని కలిపి టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? బీజేపీని వదిలి పొత్తు పెట్టుకుంటారా? అనేది చూడాలి.