రామాలయంలో విశేష పూజలు      

రామాలయంలో విశేష పూజలు      

పెద్దశంకరంపేట, ముద్ర: మండల కేంద్రమైన పెద్ద శంకరంపేటలోశ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునర్నిర్మానంలో భాగంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు.  బ్రాహ్మణోత్తములు సీతారామచంద్రులతో పాటు లక్ష్మణ, భరత శత్రుజ్ఞులకు విశేష పూజలు జరిపారు. రెండవ రోజు సుదర్శన యాగం,  వేద మంట్రాల మధ్య ఎంతో భక్తి పారవశ్యంతో చేపట్టారు. పురాతన ఆలయంలో ఉన్న సీతారామచంద్రస్వామి,  లక్ష్మణ భరత శత్రుజ్ఞలతో పాటు ఆంజనేయస్వామికి అభిషేకాలు నిర్వహించారు.

 గ్రామ నూతన మహాస్నపనం స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించిన అనంతరం సుదర్శన, రుద్రహోమములు, సుందరకాండ పారాయణం నిర్వహించారు.  ప్రధాన దేవాలయంలో వెలసిన భగవత్ మూర్తులకు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు గుజ్జరి కనకరాజు దంపతులచే వేద బ్రాహ్మణోత్వములు నిర్వహించగా మండల పరిషత్ అధ్యక్షులు జంగం శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మురళి పంతులు, పెద్దశంకరంపేట మండల బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు, అసూరీ రామచంద్ర చారి, కార్యక్రమ నిర్వాహకులు వేద బ్రాహ్మణోత్తములు శిలాంకోట ప్రవీణ్ శర్మ, చంద్రశేఖర్ శర్మ,  మనోహర్ శర్మ, సంతోష్ కుమార్ శర్మ,  ధర్మకర్త మండలి సభ్యులు కందుకూరు రవీందర్, రమేష్, డాక్టర్ అనిల్, పున్నయ్య, చాకలి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.