క్రీడలతోనే ఆరోగ్యం

క్రీడలతోనే ఆరోగ్యం

ఎంపీపీ జంగం శ్రీనివాస్ పెద్దశంకరంపేట, ముద్ర: క్రీడలతోనే మనిషికి ఆరోగ్యం చేకూరుతుందని పేట మండల పరిషత్ అధ్యక్షులు జంగం శ్రీనివాస్ అన్నారు.  సోమవారం పెద్దశంకరంపేట మండలానికి సంబంధించిన సీఎం కప్ క్రీడోత్సవాలను ఎంపీపీ ప్రారంభించారు. క్రీడల వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నారని అన్నారు.  ప్రభుత్వ లక్ష్యం మేరకు యువకులు కూడా స్పందిస్తూ క్రీడల పట్ల మక్కువ పెంచుకొని క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎంపీడీవో రఫిక్ ఉన్నిస్తా మాట్లాడుతూ ప్రభుత్వం సీఎం కప్ పోటీల్లో 15 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలలోపు ఉన్న యువతీ యువకులకు క్రీడా పోటీలు మండల పరిధిలో కబడ్డీ, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ గేమ్స్,  100 మీటర్స్ రన్నింగ్ నిర్వహిస్తున్నట్లు  పేర్కొన్నారు.  ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి మెమొంటోలు ఇచ్చి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు వీరిని పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సురేష్ గౌడ్, డిఎస్ఓ నాగరాజు, ఎంపిటిసి సభ్యులు దత్తు సుభాష్ గౌడ్, దామోదర్,  జిల్లా పిఆర్టియు గౌరవ అధ్యక్షులు రామచంద్ర చారి, మండల ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారి విజయకుమార్, చీలపల్లి సర్పంచ్ ప్రకాష్, పిఈటిలు పాల్గొన్నారు.