రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి

రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి

సిద్దిపేట :ముద్ర ప్రతినిధి కనీస గౌరవ వేతనంతో పాటు  తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్య వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేదంటే జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మెకు దిగుతామని తెలియజేసింది. రేషన్‌ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రేషన్‌ డీలర్ల సంఘం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల అధ్యక్షుడు మంద లక్ష్మారెడ్డి సోమవారం అక్కడి తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు ఎండీ సలీం మియాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంద లక్ష్మారెడ్డి మాట్లాడుతూదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు.రాష్ట్ర వ్యాప్త డీలర్లకు వేతనం ఇవ్వాలని,2021 లో కుడా స్ట్రైక్ నోటీసు ఇచ్చిన సమయం లో ప్రభుత్వం మంత్రులతో తమ సమస్యల పరిస్కారానికి సబ్ కమిటీ వేయడం జరిగిందని ఇప్పటి వరకు ఏ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.అలాగే ఆ సమస్యను పరిష్కరించి,10 లక్షల ఇన్సూరెన్స్ అమలు చెయ్యలనికోరారు. దిగుమతి హమాలీ ప్రభుత్వమే భరించాలని,ప్రతి ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ లో  వేయింగ్ బ్రిడ్జ్ లు ఏర్పాటు చేయాలని.శాశ్వత ఆథరైజేషన్ ఇవ్వాలని,ఉచిత బియ్యం పంపిణీ సందర్భంగా కరోనాసోకి చనిపోయిన 99 మంది డీలర్లకు ఎటువంటి నియమ నిబంధన లేకుండా డీలర్ షిప్ లు ఇవ్వాలని,
 కారుణ్య నియామకాలు 50 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని,చనిపోయిన డీలర్ కి దహన సంస్కారాలకు 50 వేల రూపాయలు ఇవ్వాలని,ఒక క్వింటాల్కు ఒక శాతం తరుగు ఇవ్వాలని ప్రతినెల ఈపాస్ మెషిన్ లో నుంచి తొలగించాలని ( క్లోజింగ్ బ్యాలెన్స్ ), కార్పొరేషన్ వద్ద వివిధ రకాలలో ఉన్న మా డబ్బులు ఒక ఫండ్ ఏర్పాటు చేసి దానికి కమిషనర్ గారి అధ్యక్షతన రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్లకు రుణం రూపంలో అవసరాన్ని బట్టి అందించాలని కోరారు సీఎం కేసీఆర్ ఇచ్చిన రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో  తెలంగాణ ఉద్యమం మాదిరిగానే వంటావార్పు, చలో హైదరాబాద్ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు నస్కంటి నాగరాజు, న్యాలపల్లి నర్సింలు, సౌడు దుర్గయ్య, ధారబోయిన మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.